శరీరంలో వేడి పెరిగినప్పుడు రాబోయే వ్యాదుల నివారణకు ఇంటి ఉపచార పద్ధతులు

వైద్యులు మేఘరాజ్‌ పరాడ్కర్‌

 

1. శరీరంలో వేడి పెరిగిన లక్షణాలు

గొంతు, ఛాతీ లేదా కడుపులో మంట, మూత్ర విసర్జన సమయంలో మంట, శరీరంపై సెగ గడ్డలు; కళ్ళు, చేతులు లేదా కాళ్ళు వెచ్చగా మారడం, అధిక ఋతుస్రావం, మలం లో రక్తం పడటం శరీరంలో వేడి పెరగినప్పుడు కొన్ని లక్షణాలు.

 

2. గృహ నివారణలు

అ. 1/4 వ కప్పు నీటిలో 1 టీచెంచా అవిసె గింజలను (లేదా పవిత్ర తులసి విత్తనాలు) నానబెట్టి, సాయంత్రం ఒక కప్పు పాలలో (గమనిక 1) వేసి త్రాగాలి.

గమనిక 1 – పాలు త్రాగే సందర్భంలో గుర్తుంచుకోవలసిన నియమాలు: ఔషధంతో అయినా లేదా ఔషధం లేకుండా అయినా సరే, పాలు త్రాగే 3 గంటల ముందు మరియు కనీసం 1.5 గంటలు తరువాత ఏమీ తినకూడదు.

ఆ. చిక్కటి గులాబీ చక్కెర పాకం మార్కెట్లో లభిస్తుంది. దీనిని సాయంత్రం 1 టీచెంచా ఒక కప్పు పాలలో కలిపి త్రాగాలి. ఒక టీచెంచా నానబెట్టిన అవిసె లేదా తులసి విత్తనాలను కూడా కలుపుకోవచ్చు.

ఇ. గులాబీ చక్కెర పాకంను పానీయంలో కలిపి రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవాలి లేదా 1 టీచెంచా గుల్క్‌ంద (గులాబీ చక్కెర పాకం) తినాలి.

 

గుండె మరియు అన్ని శారీరక అవయవాల వ్యాధులలో ఆయుర్వేద చికిత్స ఇచ్చు సమయాలు

భోజనం తర్వాత లేదా భోజనం చేసిన ఒకటిన్నర గంటలలోపు తీసుకున్న ఏదైనా ఔషధం గుండె మరియు మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే, ఈ సమయంలో వ్యాన్‌ ప్రాణశక్తి చురుకుగా ఉంటుంది. ఈ ప్రాణశక్తి, గుండె పరిధిలో ఉన్నప్పటికీ, శరీరమంతా ప్రయాణిస్తుంది.

– సనాతన వైద్యులు మేఘరాజ్‌ పరాడ్కర్‌ (18.2.2018)

Leave a Comment