కర్ణాటక రాష్ట్రంలోని, నిపని ప్రాంతంలో చాలా సంవత్సరాలు గర్భస్థ పిండ శాస్త్ర నిపుణులుగా పనిచేసిన మిస్టర్ అనిరుద్ పటాన్ శెట్టి, వంధ్యత్వ శాస్త్ర రంగంలో చాలా అనుభవం కలిగి ఉన్నారు. అతను వంధ్యత్వ వైద్యశాలలో పనిచేసేటప్పుడు గమనించిన దుష్ప్రవర్తనలను ముందుకు తెచ్చారు. ఆధ్యాత్మికత ఆధారంగా వైద్యులు మేఘరాజ్ పరాడ్కర్ సమాధానమిచ్చిన ఈ సందర్భంలో ఆయన అడిగిన ప్రశ్నలు క్రింద ఇవ్వబడ్డాయి.
శ్రీ. అనిరుద్ధ పట్టాణ్‌శెట్టి
శ్రీ. అనిరుద్ధ పట్టాణ్‌శెట్టి : ఆధ్యాత్మికశాస్త్రానుసారంగా స్త్రీ గర్భం దాల్చిన సుమారు 6 నుండి 8 వారాలలో జీవాత్మ పిండంలోకి ప్రవేశిస్తుంది. వీర్యకణాల కదలికలు కొనసాగుతాయి మరియు అండం కూడా పెరుగుతుంది. అవి ప్రాణములేనివి అయితే వీర్యకణాలు ఎలా కదులుతాయి మరియు అండం ఎలా పెరుగుతుంది?
జవాబు : ఆధ్యాత్మికశాస్త్రానుసారంగా పిండములో ప్రాణము వీర్యకణాలు(శుక్రాణువులు) మరియు అండం (స్త్రీబీజము) గర్భాశాయములో ఫలదీకరణమైన క్షణము నుండి ప్రారంభమవుతుంది, ఆ క్షణంలోనే జీవాత్మ దానిలోకి ప్రవేశిస్తుంది. గర్భం దాల్చిన 6 నుండి 8 వారాల తరువాత కాదు. పిండం పెరుగుదలకు దైవ చైతన్యమే కారణమైనది . ఈ విషయానికి సంబంధించిన సూచనలు క్రింద వివరించబడ్డాయి.
1. शुक्रशोणितजीवसंयोगे तु खलु कुक्षिगते गर्भसञ्ज्ञा भवति । – చరకసంహిత , శరీరస్థాన్, అధ్యాయం 4, వరుస 5
అర్థం : స్త్రీ గర్భంలో వీర్యకణం, అండం(స్త్రీబీజము) మరియు జీవాత్మ కలిసినప్పుడు, అవి కలిసి ‘గర్భము’ తయారౌతుంది.
२. शुक्रशोणितसंसंर्गम् अन्तर्गर्भाशयगतं जीवः अवक्रामति सत्त्वसम्प्रयोगात् तदा गर्भः अभिनिर्वर्तते । – చరక సంహిత, శరీరస్థాన్, అధ్యాయం 3, వరుస 3
అర్థం : ఉపచేతన మనస్సుతో కట్టుబడి ఉన్న ఆత్మ, స్త్రీ గర్భంలోకి ప్రవేశించిన వీర్యకణం, అండంతో కలిసినప్పుడు, అది ‘పిండం’ అవుతుంది.
స్పష్టీకరణ : గర్భధారణకొరకు వీర్యకణం మరియు అండం (స్త్రీబీజము) యొక్క కలయిక మాత్రమే సరిపోదు. అదే సమయంలో ఆత్మ ప్రవేశించడము కూడా అంతే ముఖ్యం. ఆత్మ ప్రవేశించనిచో, గర్భధారణ జరుగదు. జీవాత్మ యొక్క ప్రవేశం విధి(ప్రారబ్ధము)పై ఆధారపడివుంటుంది.
३. तं चेतनावस्थितं वायुः विभजति … । – సుశృతసంహిత , శరీరస్థాన్, అధ్యాయం 5, వరుస 3
అర్థం : చైతన్యముతో యుక్తమైన గర్భమునకు వాయుతత్వము ఆకారమునిస్తుంది.
4. తల్లి గర్భంలో పిండం 6 నుండి 8 వారాల మధ్యలో ప్రాణం పోసుకుంటుందని ప్రస్తావించడం ఒక అపోహ. బహుశా, ఈ కాలంలో మనస్సు మరియు తెలివి అభివృద్ధి చెందుతాయని వారు చెప్పాలనుకుంటుండవచ్చు. ఆయుర్వేదమనుసారంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనస్సు ఐదవ నెలలో మరియు ఆరవ నెలలో తెలివి వ్యక్తరూపములో పెరుగుతాయి. ఈ విషయానికి సంబంధించిన సూచనలు క్రింద ఇవ్వబడ్డాయి.
पंचमे मनः प्रतिबुद्धतरं भवति । षष्ठे बुद्धिः । – సుశ్రుత సంహిత , శరీరస్థాన్, అధ్యాయం 3, వరుస 30
అర్థం : గర్భంలోని పిండం యొక్క మనస్సు ఐదవ నెలలో మరియు తెలివి ఆరవ నెలలో సక్రియం అవుతాయి.
– వైద్యులు మేఘరాజ్ మాధవ్ పరాడ్కర్, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా (25.5.2019)