దీపావళి : దివాలీ అను పదము దీపావళి అనే పదము నుండి తయారైనది. దీపావళి ఈ పదము దీప + ఆవళి (వరుస ) ఇలా తయారైనది. దీనికి అర్థము, దీపముల వరుస. దీపావళికి అన్నిచోట్లలో దీపాలను వెలిగిస్తారు.
అ. పదునాలుగు సంవత్సరాల వనవాసము సమాప్తమైన తరువాత ప్రభూ శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపోత్సవాన్ని జరుపుకున్నారు. ఆనాటి నుండి దీపావలీ ఉత్సవమునకు ప్రారంభమైనది.
ఆశ్వయుజ బహూళ త్రయోదశి (ధనత్రయోదశి), ఆశ్వయుజ బహూళ చతుర్దశి (నరక చతుర్దశి ), అమావాస్యా (లక్షీ) మరియు కార్తిక శుద్ద ప్రతిపదా (బలీప్రతిపదా) ఇలా నాలుగు రోజులు దీపావలిని జరుపుకుంటారు. కొందరు త్రయోదశిని దీపావలిలో అంతర్భుతము చేయకుండ, ‘దీపావళి మిగిలిన మూడు రోజులదని భావిస్తారు. వసుబారస్ (గోవత్స) మరియు భావుబీజ (అన్న – చెల్లి పండుగ) ఇవి దీపావళిని జోడించి వచ్చును, కావున వాటిని దీపావళిలో అంతర్భుతము చేస్తారు; కాని వస్తుతః ఈ పండుగలు వేరు వేరుగా ఉంటాయి.