కలశస్థాపన

శ్రీ దుర్గాదేవి మరియు చెడు తరంగాల మధ్య జరిగిన యుద్ధమునకు ప్రతీకగా కలశము మరియు దీపమును 9 రోజులు పూజించడమే నవరాత్రి. నవరాత్రిలో దీపమును అఖండముగా వెలిగించుట వలన భక్తులకు దైవీతత్త్వ లాభము కలుగుతుంది. నవరాత్రులలో అఖండ దీపప్రజ్వలన ఎందు కొరకు ? నవరాత్రులలో వాతావరణము శక్తి స్వరూపమైన తేజస్సుతో నిండియుండును. దీపము తేజమునకు ప్రతీకమైనందున దీపపు జ్యోతి వైపు దేవి యొక్క శక్తి స్వరూపమైన తేజతత్త్వ తరంగాలు ఆకర్షించబడును. ఈ తరంగాలు వాస్తులో నిరంతరము సంచరించుట … Read more

శ్రీ గణేశ చతుర్థి

గణేశ చతుర్థి వ్రతమును కుటుంబములో ఎవరు చేయవలెను ? : అన్న దమ్ములు ఉమ్మడి కుటుంబములోనే ఉంటే అందరూ ఒకే మూర్తిని పూజించాలి. ఏ కారణంగానైనా విడివిడిగా ఉంటే వారివారి ఇళ్ళల్లో స్వతంత్రంగా గణేశ వ్రతమును ఆచరించాలి. మూర్తిశాస్త్రానుసారంగా మట్టితో, నైసర్గిక రంగులతో తయారు చేసిన శ్రీ గణేశ విగ్రహంను పూజ చేయువారికి ఆధ్యాత్మిక లాభము కలుగును. (మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ లఘుగ్రంధం ‘శ్రీ గణపతి’ మరియు వెబ్ సైట్ లోని … Read more

శ్రీకృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మము శ్రావణ బహుళ అష్టమి నాడు మధ్యరాత్రి, రోహిణి నక్షత్రంలో చంద్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు అయినది. ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండి రాత్రి 12 గంటలకు బాల కృష్ణుడి జన్మమహోత్సవమును ఆచరిస్తారు, తరువాత ప్రసాదం తీసుకొని ఉపవాసమును విరమిస్తారు. లేదా మరుసటి రోజు పొద్దున్న పెరుగు ప్రసాదం తీసుకుని ఉపవాసమును విరమిస్తారు. (మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ గ్రంధం ‘శ్రీవిష్ణువు, శ్రీరామ మరియు శ్రీకృష్ణ’ మరియు వెబ్ సైట్ … Read more

రాఖీ పండుగ

రాఖీ పండుగ మరియు శాస్త్రము సోదరుడు కూర్చొవడానికి పెట్టిన పీట చుట్టూ ముగ్గు వేయవలెను. దీనివలన భగవంతుని చైతన్యము ఆకర్షితమై సోదరీ-సోదరులకు దీని ప్రయోజనం కలుగుతుంది. నూనె దీపముతో సోదరునికి హారతినిచ్చి రాఖీ కట్టవలెను. హారతి వలన భగవంతుని శక్తి ఆకర్షితమై సోదరుని బుద్ధి సాత్త్వికమగుటకు సహాయమవుతుంది. సోదరునికి శుభం కలగాలనీ సోదరి, సోదరి సంరక్షణ అవ్వాలని సోదరుడు ప్రార్థించవలెను. తమ నుండి దేశ-ధర్మ రక్షణ కొరకు ప్రయత్నం జరగాలని ఇద్దరూ ప్రార్థన చేయవలెను. (మరిన్ని వివరాల … Read more

వరమహాలక్ష్మి వ్రతం

కుంకుమార్చన యొక్క ప్రాముఖ్యత పద్ధతి : అమ్మవారి నామజపం చేస్తూ ఒక్కొక్క చిటికెడు కుంకుమను అమ్మవారి చరణాల నుండి శిరస్సు వరకు సమర్పించవలెను లేదా అమ్మవారికి కుంకుమతో స్నానం చేయించవలెను. శాస్త్రము : ఎరుపు ప్రకాశం నుండి శక్తితత్త్వము ఉత్పన్నమైనది. కుంకుమలో శక్తితత్త్వమును ఆకర్షించే సామర్థ్యం అధికంగా ఉన్నది. కుంకుమార్చన ద్వారా అమ్మవారి విగ్రహం జాగృతమగును. జాగృత విగ్రహంలోని శక్తితత్త్వము కుంకుమలో ప్రవేశించుట వలన ఆ కుంకుమను మనము పెట్టుకున్నప్పుడు అందులోని అమ్మవారి శక్తి మనకు లభించును. … Read more

నాగపంచమి

నాగపంచమి సందర్భంగా నాగుపాముల ప్రాముఖ్యత ! ‘శేషనాగు తన పడగ పై పృథ్విని ధరించి ఉంటుంది. అది పాతాళంలో ఉంటుంది. దానికి వెయ్యి పడగలుంటాయి. ప్రతి పడగ పై ఒక వజ్రం ఉంటుంది. ఈ వజ్రం శ్రీవిష్ణు యొక్క తమోగుణం నుండి ఉత్పన్నమైనది. ప్రతి కల్పం చివరిలో శ్రీవిష్ణువు మహాసాగరంలో శేషాసనం పై శయనిస్తాడు. త్రేతాయుగంలో శ్రీవిష్ణువు రాముడి అవతారం తీసుకున్నాడు. అప్పుడు శేషుడు లక్ష్మనుడి అవతారం తీసుకున్నాడు. ద్వాపర మరియు కలి ఈ యుగాల సంధికాలంలో … Read more

గురుపౌర్ణమి

సమర్థ రామదాస స్వామి గారు స్వధర్మ స్వరాజ్య సంస్తపకులైన ఛత్రపతి శివాజీ మహారాజులకు ‘ధర్మరక్షణ కొరకు స్వరాజ్యాన్ని స్థాపించడమే నిజమైన గురుదక్షిణ !’ అనే మంత్రమును ఇచ్చారు అలాగే వారి చేత హిందవి స్వరాజ్యమును స్థాపించుకున్నారు. ధర్మమును తెలుసుకున్న గురువులే నిజంగా ధర్మాన్ని రక్షించగలరు. ప్రాచీన గురు-శిష్య పరంపర నుండి లభించిన ఈ బోధన మరియు సమర్థులు ఇచ్చిన ఈ మంత్రమును మళ్ళి కృతిలో తీసుకుని వచ్చే సమయం ఆసీనమైనది. హిందూ ధర్మం యొక్క రక్షణ మరియు … Read more

తొలి ఏకాదశి

తోలి ఏకాదశి విష్ణు భక్తులకు చాలా మహాత్వమైన రోజు. ఈ రోజు స్వామి దర్శనంతో పాటు ఉపవాసం కుడా చేస్తారు. చాతుర్మాస వ్రాతలను కుడా ప్రారంభిస్తారు. స్వామి గురించి ఒక విషయం తెలుసుకుందాం. శ్రీవేంకటేశ్వర స్వామి నేత్రములు సగం ఎందుకు మూసి ఉంచుతారు ? శ్రీవిష్ణువు యొక్క ఇతర రూపములతో పోలిస్తే వెంకటేశ్వర స్వామి నేత్రముల నుండి ప్రక్షేపితమగు శక్తి (తేజస్సు) ఎక్కువగా  ఉండును. కలియుగములోని ప్రజల ఆధ్యాత్మిక స్థాయి తక్కువ ఉండుటవలన, ఈ శక్తిని సహించుట … Read more

బోనాలు పండుగ

బోనాలు రోజున అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి పూజలో వివిధ పువ్వులను ఉపయోగించుటకు గల శాస్త్రమును తెలుసుకుందాము.. అమ్మవారికి పూలను సమర్పించుటకు గల అధ్యాత్మశాస్త్రము విశిష్ట దేవతలకు విశిష్ట సువాసన మరియు రంగుల పూలను సమర్పించుట వలన అమ్మవారి తత్త్వము సువాసన మరియు రంగు వీటి కణముల వైపు వేగంగా ఆకర్షింపబడును. అందువలన పూజ చేయువారికి అమ్మవారి తత్త్వము ఎక్కువగా దొరకును. శ్రీ దుర్గాదేవికి మల్లె పూలు, శ్రీ లక్షీ దేవికి బంతి పూలు మరియు శ్రీ మహాలక్షీ … Read more

వటసావిత్రి వ్రతం

వటసావిత్రి వ్రతం యోక్క శాస్త్రము ! వట వృక్షం శివ స్వరూపము. వటవృక్షంను పూజించడం అనగా దీని ద్వారా శివస్వరూపములోని భర్తను చూస్తూ, అతడి ఆయువు వృద్ధి చెంది అతడి ప్రతి కర్మానికి తోడుగా ఉండాలని భగవంతుని పూజించడం. వట పూర్ణిమ రోజున చేయవలసిన ప్రార్థన ! వటపూర్ణిమ  వ్రతం యొక్క పూజ చివరిలో ‘అఖండ సౌభాగ్యం లభించని, నాతొ పాటు నా భర్త, పిల్లలకు ఆయురారోగ్యం-ఐశ్వర్యం లభించని, అలాగే ధనధాన్యం మరియు వంశ వృద్ధి అవ్వని’, … Read more