గణేశ విగ్రహాలలో వివిధ రకాలు ఏవి ?
1. సాధారణ విగ్రహం గణేశ విగ్రహ తయారీ శాస్త్రం “శ్రీ గణపత్యధర్వశీర్షము” లో ఇలా ఇవ్వబడింది, ‘ఏకదంతం, చతుర్హస్తం……’, అంటే ఒకే దంతం కలవాడు, నాలుగు చేతులు కలవాడు, పాశమును మరియు అంకుశమును ధరించేవాడు, విరిగిన దంతమును ఒక చేతితో పట్టుకుని మరొక చేతిని వరాలను ఒసగే ముద్రలో (వరద ముద్ర) పెట్టువాడు, ధ్వజం పై మూషిక చిహ్నం కలవాడు, ఎర్రని కాంతి కలవాడు, పెద్ద ఉదరం కలవాడు (లంబోదరుడు), చేటల వంటి చెవులు కలవాడు, ఎర్రని వస్త్రములు ధరించేవాడు, దేహమునకు ఎర్రని గంధము (రక్తచందనము) పూయబడువాడు, ఎర్రని పువ్వులతో పూజింపబడువాడు. సూచన – శ్రీ గణేశుడు ఒక్క చేతిలో (విరిగిన) దంతమును ధరించినవాడు అని అథర్వశీర్షములో అతని రూపము గురించి చెప్పారు. శ్రీ గణేశుడు ముఖ్యంగా … Read more